భార్య సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తోందని చితకబాదిన భర్త
- గుజరాత్ లోని వడోదరలో ఘటన
- భార్యకు సల్మాన్ ఖాన్ అంటే వీరాభిమానం
- భార్య సల్మాన్ ఖాన్ ను పొగడడంతో జెలసీ పెంచుకున్న భర్త
- కనీసం రోడ్డు పక్కన సల్మాన్ హోర్డింగ్స్ ను కూడా చూడనివ్వకుండా భార్యపై ఆంక్షలు
భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే కారణాలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అందుకు ఈ ఉదంతమే నిదర్శనం. తన భార్య సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తోందని ఆమెను భర్త చితకబాదిన వైనం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
గుజరాత్ లోని వడోదరకు చెందిన దంపతులకు కొన్నాళ్ల కిందట పెళ్లయింది. భార్యకు సల్మాన్ ఖాన్ అంటే వీరాభిమానం. ఓసారి సల్మాన్ ఖాన్ సినిమా చూసిన ఆమె అతడిని కాస్త ఎక్కువగా ప్రశంసించడంతో భర్తకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి జెలసీ పెంచుకున్నాడు.
టీవీలో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుంటే వెంటనే చానల్ మార్చేసేవాడు. కనీసం వాణిజ్యప్రకటనల్లో కూడా సల్మాన్ ఖాన్ ను చూడడాన్ని ఇష్టపడేవాడు కాదు. చివరికి రోడ్డు పక్కన సల్మాన్ ఖాన్ బొమ్మ ఉన్న హోర్డింగ్స్ ను కూడా చూడవద్దని భార్యకు ఆంక్షలు విధించాడు.
ఇటీవల టీవీలో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుంటే భార్య చూడడాన్ని భర్త గమనించాడు. పట్టరాని కోపంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
దాంతో ఆమె భర్తను స్టేషన్ కు పట్టుకొచ్చిన పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించాలని హితవు పలికారు. అనంతరం వారిని పంపించివేశారు.