చంద్రబాబును విచారిస్తున్న గదిలోకి సాక్షి ఫొటోగ్రాఫర్ ను ఎలా అనుమతించారు?: పట్టాభి
- గతరాత్రి చంద్రబాబును విచారించిన సీఐడీ
- విచారణ ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చిన వైనం
- ఇది బ్లూ మీడియా పనే అంటూ పట్టాభి ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబును విచారిస్తున్న గదిలోకి సాక్షి ఫొటోగ్రాఫర్ పవన్ ను, కెమెరామన్ సత్యను ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. వీడియోలు, ఫొటోలు విడుదల చేసి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్ చేతిలో సీఐడీ అధికారులు కీలుబొమ్మలుగా మారిపోయారని, తాడేపల్లి ప్యాలెస్ నేతృత్వంలోనే చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం నడుస్తోందని పట్టాభి ఆరోపించారు.
"చంద్రబాబును అధికారులు ప్రశ్నిస్తుంటే, ఆయన సమాధానాలు చెప్పలేకపోతున్నారని దుష్ప్రచారం చేసేందుకే ఈ ఫొటోలు, వీడియోలు లీక్ చేశారు. మిగతా మీడియా సంస్థల ప్రతినిధులకు లేని అనుమతి, కేవలం సాక్షి మీడియా ప్రతినిధులకు ఎలా వచ్చింది?" అంటూ పట్టాభి నిలదీశారు.