ఆ పాట చిత్రీకరణ తరువాత టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నా: రవీనా టాండన్
- ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపిన వాన పాట ‘టిప్ టిప్ బర్సా పానీ’
- ఆ పాట్ షూటింగ్‌లో తానెంత ఇబ్బంది పడిందీ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న రవీనా టాండన్
- దెబ్బలు తగలకుండా నీ ప్యాడ్స్ వేసుకున్నా మోకాలికి గాయాలు అయ్యాయని వెల్లడి
- ఇంటికి వెళ్లాక గాయాలు గుర్తించిన తాను చివరకు టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నానన్న రవీనా
- తెరపై అందంగా కనిపించే సీన్ల వెనక నటీనటుల అపారమైన కష్టం ఉంటుందని వ్యాఖ్య
భారతీయ సినిమాల్లో వాన పాటలకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆ పాటల చిత్రీకరణ కోసం నటీనటులు పడే కష్టం మాత్రం అపారం. ఇక బాలీవుడ్ సినిమా ‘మోహ్రా’లో ‘టిప్ టిప్ బరసా పానీ వానపాటల్లోకెల్లా ఓ సంచలనం అంటే అతిశయోక్తి కాదేమో. ఈ మూవీలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ జంటగా నటించారు. అప్పట్లో ఈ పాట యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. అయితే పాట చిత్రీకరణలో తాను పడ్డ ఇబ్బందుల్ని రవీనా టాండన్ తాజాగా వివరించారు.
‘‘నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేశారు. చుట్టూ ఇనుప చువ్వలు, అపరిశుభ్ర పరిసరాలు! దీంతో, కాళ్లకు చెప్పుల్లేకుండా పాట షూట్‌లో పాల్గొన్న నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వర్షంలో చీర ధరించి అలాంటి మూమెంట్స్ చేయడం కోసం కష్టపడాల్సి వచ్చింది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు నీ ప్యాడ్స్ వేసుకున్నా. ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు గాయాలయ్యాయి. టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత రెండు రోజుల పాటు అనారోగ్యానికి గురయ్యా. మీకు తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు పడ్డా పాటకు వచ్చిన రెస్పాన్స్‌కు మేము ఎంతో ఆనంద పడ్డాం’’ అని నాటి జ్ఞాపకాల్ని తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది రవీనా.