సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకు చంద్రబాబు
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
- నిన్న సాయంత్రం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన సీఐడీ అధికారులు
- 12 గంటల అనంతరం ఏసీబీ కోర్టుకు తరలింపు
- విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
టీడీపీ అధినేత చంద్రబాబును సిట్ నిన్న సాయంత్రం కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తీసుకురాగా, దాదాపు 12 గంటల అనంతరం ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కొన్ని సంతకాల కోసం అంటూ చంద్రబాబును మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన ఏసీబీ అధికారులు... కాసేపటి తర్వాత ఏసీబీకి కోర్టుకు తీసుకెళ్లారు. నిన్న వేకువ జామున చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు 24 గంటల సమయం పూర్తి కావొస్తుందనగా ఆయనను ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు.
అప్పటికే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్, చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు టీడీపీ న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాసేపట్లో చంద్రబాబు రిమాండ్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి.