చంద్రబాబు అరెస్ట్ పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు... తిరస్కరించిన న్యాయమూర్తి
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
- నంద్యాల నుంచి కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించిన సీఐడీ అధికారులు
- చంద్రబాబును అరెస్ట్ చేసి చాలా సమయం అయిందన్న టీడీపీ న్యాయవాదులు
- న్యాయమూర్తి నివాసానికి వెళ్లి హౌస్ మోషన్ పిటిషన్ అందజేత
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఆ పార్టీ వర్గాలు న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. టీడీపీ న్యాయవాదుల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. టీడీపీ న్యాయవాదుల బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ అందజేశారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి చాలా సమయం అయిందని టీడీపీ న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. వయసు, ఆరోగ్య రీత్యా... అరెస్ట్ చేసిన 24 గంటల్లో చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలని పిటిషన్ లో ప్రస్తావించారు.
అయితే చంద్రబాబును కోర్టులో హాజరుపరిచినప్పుడే వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై హౌస్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించారు.