రేపు రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షలకు టీడీపీ పిలుపు
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
- తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ వర్గాలు
- నేటి రాత్రి కాగడాలతో మార్చ్
- టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనల్లో పాల్గొనాలన్న అచ్చెన్న
నంద్యాలలో అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇంకా కుంచనపల్లి సిట్ కార్యాలయంలోనే ఉంచారు. చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి, లోకేశ్ సిట్ కార్యాలయానికి వచ్చారు. అయితే చంద్రబాబును కలిసేందుకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో వారు సిట్ కార్యాలయంలో వేచిచూస్తున్నారు.
కాగా, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ రేపు రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ చేపడుతున్న నిరాహార దీక్షల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఈ రాత్రికి కాగడాల మార్చ్ నిర్వహించాలని పేర్కొన్నారు.
విదేశాల్లో టీడీపీ ఎన్నారైల ఆందోళన
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, నెదర్లాండ్స్ దేశాల్లోని టీడీపీ ఎన్నారై విభాగాలు ఆందోళన చేపట్టాయి. లండన్ లో సీఎం జగన్ బస చేసిన ప్రాంతంలోనే ఎన్నారైలు నిరసనకు దిగారు. జగన్ ప్రభుత్వం నీచ రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.