ప్రజాస్వామ్యం లేదా ప్రతిపక్షం లేని దేశాల్లోనే ఇలా జరుగుతుంది: చిదంబరం

  • జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి విందు
  • విందుకు హాజరవుతున్న ప్రపంచ దేశాధినేతలు
  • కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందని ఆహ్వానం
  • కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్న కాంగ్రెస్ నేతలు
ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడం విమర్శలకు దారితీసింది. 

దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. ప్రపంచ నేతలకు ఇచ్చే విందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విపక్ష నేతను పిలవకపోవడం ఇక్కడే చూస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరే ఇతర దేశాల్లోనూ జరుగుతాయని ఊహించలేమని తెలిపారు. 

ప్రజాస్వామ్యం లేదా ప్రతిపక్షం లేని దేశాల్లో ఇలాంటివి జరుగుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే... ప్రజాస్వామ్యం, విపక్షం ఉనికిని కోల్పోయే దశకు భారతదేశం చేరుకోబోతోందని చిదంబరం అభిప్రాయపడ్డారు.


More Telugu News