యావత్ ఏపీలో టీడీపీ నేతల గృహ నిర్బంధం

  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ శ్రేణుల నిరసనలు
  • రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు
  • ప్రముఖ నాయకుల ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు ప్రారంభించాయి. దీంతో, పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉంచుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకోగా కొందరిని ఇళ్లల్లోనే అరెస్ట్ చేశారు. కొందరు ప్రముఖ నాయకుల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కుప్పం ఇన్‌చార్జి మునిరత్నంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ డాక్టర్ కాలనీలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 

మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోండు శంకర్‌ను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను ఆయన నివాసంలోనే అరెస్టు చేసి అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పరిటాల శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News