చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోంది: పురందేశ్వరి
- సరైన నోటీసు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న పురందేశ్వరి
- ఎఫ్ఐఆర్ లో పేరు కూడా పెట్టలేదని విమర్శ
- ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని... సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారు. ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.