భారత్ మోస్ట్ వాంటెడ్ లష్కరే టాప్ కమాండర్ పీవోకేలో కాల్చివేత
- రావల్‌కోట్ మసీదులో కాల్చి చంపిన సాయుధుడు
- పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చివేత
- ధాంగ్రి ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా అహ్మద్
- ప్రార్థనల కోసం కోట్లీ నుంచి రావల్‌కోట్ వచ్చిన ఉగ్రవాది
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది. రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసింను గుర్తు తెలియని సాయుధుడు అల్ ఖుదుస్ మసీదులో కాల్చి చంపాడు. ప్రార్థనల కోసం కోట్లీ నుంచి వచ్చిన ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపాడు. జనవరి 1న రాజౌరీ జిల్లాలోని ధాంగ్రిలో జరిగిన ఉగ్రదాడిలో అబుఖాసిం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఈ ఘటనలో ఏడుగురు మరణించగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దులో ఓ టాప్ టెర్రరిస్ట్ హతమవడం ఈ ఏడాది ఇది నాలుగోసారి. జమ్మూ ప్రాంతానికి చెందిన అహ్మద్ 1999 నుంచి సరిహద్దుకు ఆవల ఉంటున్నాడు. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడంలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. లష్కరే తోయిబా బేస్ క్యాంప్ అయిన మురిద్కే నుంచి కార్యకలాపాలు నిర్వహించే అహ్మద్ ఇటీవల రావల్‌కోట్‌కి మారాడు. లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ సజ్జద్ జాత్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నాడు.