రాళ్ల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించిన నారా లోకేశ్
- ఈ నెల 5న యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి
- దుర్గాప్రసాద్ అనే బాలుడికి గాయాలు
- నేడు కలగంపూడి క్యాంప్ సైట్ కి వచ్చిన దుర్గాప్రసాద్
- ఆప్యాయంగా పలకరించిన లోకేశ్
- కోనసీమలో ప్రవేశించిన యువగళం పాదయాత్ర
భీమవరం శివారు గునుపూడిలో ఈనెల 5వ తేదీన యువగళం పాదయాత్రపై రాళ్లదాడి సందర్భంగా గాయపడిన బాలుడ్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం కలగంపూడి క్యాంప్ సైట్ లో పరామర్శించారు.
భీమవరం బహిరంగ సభ అనంతరం పాదయాత్రగా వస్తున్న లోకేశ్ ను చూసేందుకు గునుపూడి వద్ద 13 ఏళ్ల బాలుడు దుర్గాప్రసాద్ కూడా వచ్చాడు. ఈ సమయంలోనే యువగళంపై రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో దుర్గా ప్రసాద్ కంటి పైభాగంలో రాయి తగిలి గాయమైంది. దుర్గాప్రసాద్ ఆరోగ్యం గురించి లోకేశ్ ఆ రోజు నుండే వాకబు చేస్తూ మెరుగైన వైద్యం అందించాలని అక్కడ శ్రేణులకు సూచించారు.
తాజాగా లోకేశ్ ను చూసేందుకు దుర్గాప్రసాద్ కలగంపూడి రాగా దగ్గరకు తీసుకుని పరామర్శించి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లోకేశ్ అన్న అంటే తనకు అభిమానమని, అందుకే ఇంతదూరం వచ్చానని బాలుడు దుర్గాప్రసాద్ చెప్పాడు.
రాజోలు నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం
యువగళం పాదయాత్ర కోనసీమలోకి ప్రవేశించింది. 208వ రోజు పాలకొల్లు నియోజకవర్గంలో పూర్తయిన యువగళం చించినాడ బ్రిడ్జి మీదుగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది.
చించినాడ బ్రిడ్జి దాటాక లోకేశ్ కు రాజోలు నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కొబ్బరికాయలతో రూపొందించిన భారీ గజమాలతో యువనేతను స్వాగతించారు. గోదావరి నదిలో బోట్లపై యువగళం జెండాలతో మత్స్యకారులు యువనేతకు స్వాగతం పలికారు.
మాజీమంత్రి, రాజోలు ఇన్ చార్జి గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో లోకేశ్ ను కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతించారు. కాగా, పాలకొల్లు నియోజకవర్గం కలగంపూడి క్యాంప్ సైట్ లో శెట్టిబలిజలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు.
ప్రభుత్వమే మద్యం అమ్మే విధానానికి స్వస్తి పలుకుతాం!
ప్రభుత్వమే మద్యం అమ్మేవిధానానికి స్వస్తి పలుకుతాం, మద్యంపాలసీలో మార్పులు తెచ్చి మద్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు గతంలో చెప్పిన ప్రకారం మద్యం షాపుల్లో 20 శాతం గీత కార్మికులకు కేటాయిస్తాం. మేము జగన్ మాదిరి సొంత బ్రాండ్లు అమ్ముకోం, కులవృత్తులను కాపాడుతాం. కల్లు గీత వృత్తికి టెక్నాలజీ జోడిస్తాం. ఇతర రాష్ట్రాల మోడల్ ఏపీలో అమలు చేస్తాం.
కల్లు అమ్మేవాళ్లను ఇటీవల సెబ్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. 2017లో చట్టం తీసుకొచ్చి కల్లును టీడీపీ ప్రమోట్ చేసింది. గతంలోనే 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇచ్చాం. గతంలో మేం అమలుచేసిన బీమాను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.
టీడీపీ వచ్చాక చంద్రన్న బీమా ప్రవేశపెడతాం. గుర్తింపు కార్డులు జారీ చేసి సంక్షేమ పథకాలు అందజేస్తాం. గీత కార్మికుల కార్పొరేషన్ కు నిధులు కేటాయించి రుణాలు అందిస్తాం. రుణాలు అందించి నీరా కేఫ్ లు ఏర్పాటు చేయడం ద్వారా గీత కార్మికుల ఆదాయం పెంచుతాం.
వారికి చేయిచాచే అలవాటు లేదు
కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు శెట్టిబలిజలు. వారికి చేయిచాచే అలవాటు లేదు. దానం చేసే గుణం ఉన్నవారు. దివంగత దొమ్మేటి వెంకటరెడ్డిగారు తన భూముల్ని త్యాగం చేశారు. టీడీపీ వచ్చాక బలహీన వర్గాలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.
రెడ్డి సుబ్రహ్మణ్యంను మండలి డిప్యూటీ ఛైర్మన్ గా, అంగర రామ్మోహన్ కు రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చాం. పితాని సత్యనారాయణకు మంత్రి పదవి కూడా ఇచ్చాం. కల్లు గీసే సమయంలో ప్రమాదంలో శెట్టిబలిజలు చనిపోతే చంద్రన్న బీమా ద్వారా ఆదుకున్నాం. ఇప్పుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోతే ఆదుకునే వారే లేరు.
మీ అందరి సమక్షంలోనే రిబ్బన్ కట్ చేస్తా!
గతంలో అన్ని నియోజకవర్గాల్లో ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించాం. 30 శాతం భూములు బలహీనవర్గాల వారికి కేటాయించాలని నిర్ణయించాం. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేస్తాం. పాలకొల్లులో అసంపూర్తిగా ఉన్న శెట్టిబలజ కళ్యాణ మండపాన్ని టీడీపీ వచ్చాక పూర్తి చేసి మీ అందరి సమక్షంలోనే రిబ్బన్ కట్ చేస్తా. దళారులకు తావులేకుండా ఐడీ కార్డులు అందజేస్తాం. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందిస్తాం. దామాషా ప్రకారం శెట్టిబలిజ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం.
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...
టీడీపీ అంటే బీసీ... బీసీ అంటే టీడీపీ. రాజకీయం అంటే సామాన్యుడని చాటిచెప్పింది టీడీపీనే. దేశ చరిత్రలోనే బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించింది అన్న ఎన్టీఆర్. 20 శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్ ఇస్తే.. 34 శాతానికి చంద్రబాబు పెంచారు. కానీ జగన్ వచ్చాక 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించారు.
జగన్ బీసీల ద్రోహి. బీసీలకు పెద్దపీట వేసేది టీడీపీనే. నేను మైకు పట్టుకుని ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడటానికి బీసీ, ఎస్సీలతో పాటు శెట్టిబలిజలు కూడా కారణమే. శెట్టిబలిజలు వన్ సైడ్ గా టీడీపీకి అండగా ఉన్నారు. నియోజకవర్గంలో 48 బీసీ కమ్యూనిటీ హాళ్లు తీసుకొస్తే... అందులో 42 శెట్టిబలిజలకే కట్టించాను.
శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...
1920లో దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ అని నామకరణం చేసి సంఘాన్ని ఏర్పాటు చేశారు. బీసీల్లో ఒక కులం మనది. టీడీపీ రాకముందు బీసీలు ఓటేసే యంత్రాలుగానే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ వచ్చాక బీసీలకు గుర్తింపు వచ్చింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎన్టీఆర్ కల్పించారు. అందులో శెట్టిబలిజ కులం కూడా ఉంది.
సామాన్యుడినైన నన్ను చంద్రబాబు ఎమ్మెల్యే చేసి, కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ ను చేశారు. నేను అధ్యక్షా అని పిలవాలని అనుకున్నా... కానీ నన్నే అధ్యక్షా అని పిలిచేలా చంద్రబాబు చేశారు. పితాని సత్యనారాయణకు మంత్రి పదవితో పాటు, ఇప్పుడు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా అవకాశం కల్పించారు.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2,852.4 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 15.5 కి.మీ.*
*209వరోజు (9-9-2023) యువగళం వివరాలు*
*రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా)*
ఉదయం
8.00 – పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – తాటిపాకలో స్థానికులతో సమావేశం.
10.15 – నగరంలో స్థానికులతో సమావేశం.
11.15 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం.
1.15 – పాశర్లపూడి విడిది కేంద్రంలో బస.
******