తెలంగాణలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగానే ఉంటాయి: కిషన్ రెడ్డి
- తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయన్న కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్‌ను ఓడించాలనే కసి బీజేపీలో వుందని వ్యాఖ్య
- కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని కేడర్‌కు పిలుపు
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోన్న తరుణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయన్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌ను ఓడించాలనే కసి బీజేపీలో ఉందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని కేడర్ సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కావన్నారు. కేడర్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు.