ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న చంద్రముఖి-2

  • రాఘవ లారెన్స్, కంగన రనౌత్ నటించిన చంద్రముఖి-2
  • పి.వాసు దర్శకత్వంలో చిత్రం
  • లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాణం
  • ఇటీవల విడుదలై విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్ర ట్రైలర్
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. 

చంద్రముఖి-2 తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. 

‘చంద్రముఖి 2’ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయటం లేదని, సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేస్తూ ఓ వీడియోను ఇటీవల విడుదల చేశారు. 

రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది. 17 సంవత్స‌రాల క్రితం "లక లక" అంటూ చంద్ర‌ముఖి తన బందీగా ఉంటున్న గ‌ది త‌లుపులు తెరుచుకుని వేట్ట‌య రాజాపై ప‌గ తీర్చుకోవ‌టానికి ప్రయ‌త్నించి విఫ‌ల‌మైంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి చంద్రముఖి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టమైంది. చంద్రముఖిగా కంగనా రనౌత్ మెప్పిస్తుందని... ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించనున్నారని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. వడివేలు తనదైన కామెడీతో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. 

ఈ చిత్రంలో ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేశ్, ర‌విమారియ, సష్టి డాంగే, సుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్, రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం అదనపు ఆకర్షణ.


More Telugu News