వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కు మధ్యంతర బెయిల్
- సునీల్ యాదవ్ తండ్రి కృష్ణయ్య కన్నుమూత
- తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన సునీల్ యాదవ్
- ఈ నెల 9, 10; 17, 18 తేదీల్లో పులివెందుల వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు
- సునీల్ యాదవ్ పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ లభించింది. సునీల్ యాదవ్ తండ్రి కృష్ణయ్య కన్నుమూసిన నేపథ్యంలో, ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టును అనుమతి కోరారు. ఈ మేరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం సునీల్ యాదవ్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 9, 10 తేదీల్లోనూ... ఈ నెల 17, 18 తేదీల్లోనూ ఎస్కార్ట్ సాయంతో పులివెందుల వెళ్లేందుకు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
అయితే తనకు పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వాలన్న సునీల్ యాదవ్ పిటిషన్ పై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.