క్రికెట్ దేవుడు సచిన్ కు బీసీసీఐ 'గోల్డెన్ టికెట్'
- అక్టోబరు 5 నుంచి భారత్ లో క్రికెట్ వరల్డ్ కప్
- జోరుగా సాగుతున్న సన్నాహాలు
- దేశంలోని వివిధ రంగాల దిగ్గజాలకు గోల్డెన్ టికెట్ అందిస్తున్న బీసీసీఐ
- సచిన్ కు స్వయంగా గోల్డెన్ టికెట్ అందించిన జై షా
మరి కొన్ని రోజుల్లో భారత్ లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వన్డే ఫార్మాట్ లో జరగబోయే ఈ మెగా ఈవెంట్ కు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కాగా, స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతున్నందున బీసీసీఐ గోల్డెన్ టికెట్ పేరిట దేశంలోని వివిధ రంగాల దిగ్గజాలకు వీఐపీ పాస్ లు అందజేస్తోంది. ఈ గోల్డెన్ టికెట్ తో వరల్డ్ కప్ లోని ఏ మ్యాచ్ ను అయినా, స్టేడియానికి వచ్చి వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించవచ్చు.
తాజాగా ఈ గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు అందజేసింది. బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వచ్చి సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించారు. క్రికెట్ నైపుణ్యానికి సచిన్ ప్రతీక అని, దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా బీసీసీఐ కొనియాడింది.
సచిన్ క్రికెట్ ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొంది. ఇప్పుడు గోల్డెన్ టికెట్ ద్వారా సచిన్ టెండూల్కర్ కూడా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో భాగమయ్యాడని బీసీసీఐ వివరించింది.
ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కూడా బీసీసీఐ గోల్డెన్ టికెట్ అందజేసింది.