ఇంట్లోకి దూరిన కొండచిలువను ధైర్యంగా పట్టేసిన ఆస్ట్రేలియా క్రికెటర్.. వీడియో

  • ఫ్లోర్ మాప్ కర్ర సాయంతో పట్టుకున్న వైనం
  • మూడు కొండ చిలువలను బయటకు పంపించిన మాజీ క్రికెటర్
  • ఇన్ స్టా గ్రామ్ లో ఇందుకు సంబంధించి వీడియో షేర్
ప్రపంచంలోనే మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకరు, ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్ (53) చిన్నపాటి సాహసం చేశారు. తన ఇంట్లోకి దూరిన కొండ చిలువలను చాకచక్యకంగా పట్టేసి, తీసుకెళ్లి బయట విడిచి పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని మెక్ గ్రాత్ తన తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొండ చిలువ విషసర్పం కాకపోయినా, అది కాటు వేస్తే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా అది కాటు వేసినా, వెంటనే విడిచి పెట్టదు. 

తన ఇంట్లోకి కార్పెట్ పైథాన్ చొరబడినట్టు గుర్తించిన మెక్ గ్రాత్ దాన్ని ఇల్లును తుడిచే మాప్ కర్ర సాయంతో పట్టేశారు. మాప్ కర్రతో దాన్ని తలభాగం వద్ద అదిమి పట్టి తోక పట్టుకుని చిన్నగా ఇంటి బయటకు తీసుకెళ్లడాన్ని వీడియోలో చూడొచ్చు. దాన్ని సురక్షితంగా తీసుకెళ్లి చెట్లలో విడిచి పెట్టినట్టు మెక్ గ్రాత్ వెల్లడించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తన భార్య సారా లియాన్ మెక్ గ్రాత్ సహకారంతో ఇంట్లోకి ప్రవేశించిన మూడు కార్పెట్ కొండ చిలువలను పట్టుకుని బయటకు పంపించినట్టు మెక్ గ్రాత్ తెలిపారు. (వీడియో కోసం



More Telugu News