రావణుడి అహంకారం, కంసుడి గర్జనలు కూడా ఏమీ చెయ్యలేకపోయాయి.. సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్

  • డీఎంకే మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలకు యోగి కౌంటర్
  • బాబర్, ఔరంగజేబ్ దురాగతాలు కూడా సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయాయన్న సీఎం
  • సనాతన ధర్మం సూర్యుడి శక్తిలాంటిదని అభివర్ణన
సనాతన ధర్మంపై గతంలో దాడులు చేసిన వారు దానికి నష్టం కల్గించడంలో విఫలమయ్యారని, ఇప్పుడు అధికార దాహంతో ఉన్న పరాన్నజీవుల వల్ల కూడా దానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలన్న రావణుడి అహంకారం కూడా విఫలమైందని, కంసుడి గర్జనలు కూడా ఎందుకూ కొరగాకుండా పోయాయని అన్నారు. బాబర్, ఔరంగజేబ్ వంటివారి దురాగతాలు కూడా నిర్మూలించలేకపోయాయని తేల్చి చెప్పారు. అలాంటి సనాతన ధర్మాన్ని చిల్లర శక్తులు తుడిచిపెట్టేస్తాయా? అని ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. సనాతన ధర్మం అనేది సూర్యుడి శక్తిలాంటిదని అభివర్ణించారు. మూర్ఖులు మాత్రమే సూర్యుడిపై ఉమ్మివేయాలని చూస్తారని, అయితే అది తిరిగి వారి ముఖంపైనే పడుతుందని అన్నారు.


More Telugu News