ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం.. త్వరలో భారత్‌కు..!
- వాఘ్ నాఖ్‌తో బీజాపూర్ సైన్యాధిపతిని 17వ శతాబ్దంలో అంతమొందించిన మరాఠా సామ్రాట్
- చాలా కాలంగా బ్రిటన్ మ్యూజియంలో వాఘ్‌నాఖ్ ప్రదర్శన
- ఆయుధాన్ని తిరిగిచ్చేందుకు బ్రిటన్ అధికారుల అంగీకారం
- అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే ఆయుధం భారత్‌కు చేరుతుందన్న మహారాష్ట్ర మంత్రి
1659 లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించేందుకు మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్ నాఖ్’ త్వరలో భారత్‌కు తిరిగిరానుంది. పులి గోళ్ల లాగా కనిపించినే ఈ ఆయుధాన్ని ఇనుముతో తయారు చేశారు. దీన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని వెనక్కు తెచ్చేందుకు మంత్రి ఈ నెలలో బ్రిటన్‌కు వెళ్లి మ్యూజియం వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
‘‘ఆ ఆయుధాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ అధికారుల నుంచి మాకు లేఖ అందింది. ఈ ఏడాదిలోనే అది మనకు చేరవచ్చు’’ అని మంత్రి పేర్కొన్నారు. అఫ్జల్ ఖాన్‌ను శివాజీ అంతమొందించిన రోజున దీన్ని భారత్‌కు తేవాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ముఖ్య తేదీలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.