కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అందని జీ20 విందు ఆహ్వానం
- ధ్రువీకరించిన ఆయన కార్యాలయం
- ఇతర పార్టీల నేతలకెవ్వరికీ అందని ఆహ్వానం
- కేబినెట్, సహాయమంత్రులు, ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్
- ఆహ్వానితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు జీ20 సమావేశాల విందుకు ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం వెల్లడించింది. కేబినెట్ మిస్టర్ హోదాతోపాటు దేశంలోని అతిపెద్ద విపక్ష నేత అయిన ఖర్గేకు విందుకు ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం తెలిపింది. అంతేకాదు, మరే ఇతర పార్టీ నేతలకు కూడా ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కేబినెట్, సహాయ మంత్రులు, ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానాలు అందాయి. పారిశ్రామికవేత్తలు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, హెచ్‌డీ దేవెగౌడకు కూడా ఆహ్వానాలు అందాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని పునరుద్ధరించిన ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్‌లోని భారత్ మండపంలో ఈ గాలా డిన్నర్ జరగనుంది. డిన్నర్ అనంతరం చిన్నపాటి సాంస్కృతిక కార్యక్రమం కూడా జరగనుంది.