మాంసం ప్రియుల కోసం హైదరాబాద్ లో ముస్తాబవుతున్న మటన్ క్యాంటీన్
- మాసబ్ ట్యాంక్ లో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఈ నెల 11 లేదా 12న ప్రారంభించనున్న మంత్రి తలసాని
- దశల వారీగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుకు యోచన
మాంసం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినియోగదారులకు నాణ్యమైన మటన్ అందించడానికి హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ అందుబాటులోకి తేనుంది. మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక కార్యాలయ సమీపంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. మటన్, బిర్యానీతో పాటు నాణ్యమైన, రుచికరమైన మటన్ వంటకాలనూ ఈ క్యాంటీన్‌లో అందించనున్నారు.
ఇప్పటికే క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 12న రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దీనిని ప్రారంభించనున్నారు. తర్వాత దశలవారీగా నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు ఫెడరేషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిష్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేయగా.. దానికి మంచి ఆదరణ లభిస్తోంది. నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ నకు కూడా ప్రజల నుంచి స్పందన వస్తోంది.