ఆరు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు
- ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఉప ఎన్నిక
- మరికాసేపట్లో వెల్లడికానున్న సరళి
- ఫలితాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అధికార, విపక్షాలు
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నానికి తేలిపోనున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘోషి, ఝార్ఖండ్‌లోని దుమ్రి, ధన్‌పూర్, త్రిపురలోని బక్సానగర్, కేరళలోని పుథుప్పల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, పశ్చిమబెంగాల్‌లోని ధుప్‌గురిలో వివిధ కారణాలతో ఈ నెల 5న ఉప ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికాసేపట్లో ఎన్నికల సరళి తెలిసిపోనుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.