ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తే.. గిఫ్ట్ వోచర్ ను పంపించిన కంపెనీ!
- ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన మహిళను ఆశ్చర్యపరిచిన సిలికాన్ వ్యాలీ కంపెనీ
- సీక్రెట్ సుషీ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ
- మిమ్మల్ని సెలక్ట్ చేయడం లేదని చెబుతూనే గిఫ్ట్ కార్డ్ పంపించిన కంపెనీ
సిలికాన్ వ్యాలీలోని ఓ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తిని సదరు సంస్థ ఆశ్చర్యపరిచింది! ఉద్యోగం ఇవ్వకుండా ఓదార్పుగా ఓ బహుమతిని పంపించింది. ఇందుకు సంబంధించి రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన ఓ కథనం అందర్నీ ఆకట్టుకుంటోంది. సిలికాన్ వ్యాలీలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 'సీక్రెట్ సుషీ' ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
మామూలుగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాక ఇవ్వని పక్షంలో, సారీ మిమ్మల్ని సెలక్ట్ చేయడం లేదని మెయిల్ పెడుతుండడం చూసి ఉంటాం. కానీ సీక్రెట్ సుషీ మాత్రం ఓ మహిళా అభ్యర్థి మేనేజర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా, తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డును పంపించింది. ఈ మేరకు రెడ్డిట్ వినియోగదారు ఒకరు రిక్రూటింగ్ హెల్ సబ్ రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న సదరు మహిళా అభ్యర్థికి సీక్రెట్ సుషీ నుండి దరఖాస్తు చేసినందుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు, మిమ్మల్ని సెలక్ట్ చేయడంలేదని పేర్కొంది. దాంతో పాటు గిఫ్ట్ వోచర్‌ను కూడా పంపించింది. ఇందుకు సంబంధించి ఆమె మెయిల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తనకు వచ్చిన 7 డాలర్ల గిఫ్ట్ వోచర్‌ను కూడా పొందుపరిచి, మరిచిపోలేని అత్యుత్తమ తిరస్కరణ అని పోస్ట్ పెట్టారు.