రోడ్డుపై నీరు నిలవకుండా డ్రెయినేజీ పైభాగాన్ని చేత్తో శుభ్రం చేసిన మహిళా పోలీస్ అధికారి
- టోలీచౌకీ ప్లై ఓవర్ వద్ద చెత్త కారణంగా మూసుకుపోయిన డ్రెయిన్‌ను క్లీన్ చేసిన పోలీసులు
- శుభ్రం చేసిన సౌత్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, మరో పోలీస్
- వీడియోను షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు
భాగ్యనగరంలో పోలీసులు చేసిన ఓ మంచి పనికి ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో పాటు కొట్టుకు వచ్చిన చెత్త పలు ప్రాంతాల్లో డ్రెయినేజీల వద్ద నిలిచిపోయింది. దీంతో రోడ్ల మీద నీరు నిలిచిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నగరంలోని టోలీచౌక్ ఫ్లై ఓవర్ వద్ద ఇలాగే చెత్త కారణంగా మూసుకుపోయిన ఓ డ్రెయినేజీ పైభాగాన్ని పోలీసులు తమ చేతులతో తీసి శుభ్రం చేసి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇద్దరు పోలీసులు ఈ డ్రెయినేజీ పైభాగాన్ని చేతులతో శుభ్రం చేశారు. ఇలా శుభ్రం చేసిన వారిలో మహిళా పోలీస్ అధికారి (ఎసీపీ ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్) డి. ధనలక్ష్మి, మరో పోలీస్ ఉన్నారు. మూసుకుపోయిన డ్రెయిన్ వల్ల ఆ ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు నిలిచి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుండటంతో ఆమె నడుంబిగించారు. కాగా, ఈ వీడియోను ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 258 కే వ్యూస్, 606 షేర్లు, 3800కు పైగా లైక్స్ వచ్చాయి.