రాజమండ్రి జైలులో యువగళం వాలంటీర్లు... పరామర్శించిన టీడీపీ బృందం
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
- అర్ధరాత్రి యువగళం క్యాంప్ సైట్ పై పోలీసుల దాడి
- 50 మంది వాలంటీర్ల అరెస్ట్
- న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధింపు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ఈ క్రమంలో బేతపూడిలో క్యాంప్ సైట్ పై దాడి చేసిన పోలీసులు 50 మంది యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.
అరెస్ట్ చేసిన వాలంటీర్లను అనేక ప్రదేశాలకు తిప్పిన పోలీసులు చివరికి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో యువగళం వాలంటీర్లను రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేతల బృందం రాజమండ్రి జైలుకు వెళ్లి యువగళం వాలంటీర్లను పరామర్శించింది. మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో వాలంటీర్లతో మాట్లాడిన టీడీపీ నేతలు వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాగా, భీమవరం ఘటనపై పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లను నమోదు చేసినట్టు తెలుస్తోంది. న్యాయమూర్తి ఎదుట దాదాపు 5 గంటల పాటు వాదనలు జరగ్గా... రాత్రి 2 గంటల సమయంలో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. యువగళం వాలంటీర్లకు రెండు వారాల రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపారు.