భారత్-ఆసియాన్ సహకారానికి 12 అంశాలు ప్రతిపాదించిన ప్రధాని మోదీ
- ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆసియాన్-భారత్ సదస్సు
- జకార్తాలో మోదీకి ఘనస్వాగతం
- ఆసియాన్ కూటమి అభివృద్ధికి కేంద్ర స్థానమన్న మోదీ
- ఆసియాన్ కూటమితో భారత్ ను అనుసంధానించాలని సూచన
ఆసియాన్-భారత్ సదస్సు ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిర్వహించగా, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు కోసం జకార్తాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఇండోనేషియా సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఘనస్వాగతం లభించింది.
ఈ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆసియాన్ కూటమి అభివృద్ధికి కేంద్ర స్థానమని తెలిపారు. ఈ సందర్భంగా భారత్-ఆసియాన్ సహకారానికి మోదీ 12 అంశాలు ప్రతిపాదించారు. ఆసియాన్ కూటమితో భారత్ ను అనుసంధించాలని సూచించారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, తీవ్రవాదులకు ఆర్థికసాయం నిలిపివేతపై ప్రతిపాదించారు. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ప్రాధాన్యతను గట్టిగా ప్రస్తావించారు.
కాగా, మ్యారిటైమ్ కోఆపరేషన్, ఆహార భద్రత తీర్మానాలకు సదస్సులో ఆమోదం లభించింది.