ఆ ఐదు సీట్లు మాకు కేటాయించండి: కాంగ్రెస్ ను కోరిన సీపీఐ
- తాము పోటీ చేయాలనుకునే స్థానాల జాబితాను కాంగ్రెస్‌కు అందించిన సీపీఐ
- కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ కోరుతున్న కమ్యూనిస్ట్ పార్టీ
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నో!
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లలో పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ ప్రతినిధులు బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో కూడిన జాబితాను అందించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హుస్నాబాద్ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ నేతలు... కాంగ్రెస్ పార్టీని కోరారు.
అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పగా, కొత్తగూడెం కేటాయించాలని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే హుస్నాబాద్‌పై కాంగ్రెస్ నో చెబుతుండగా, సీపీఐ పట్టుబడుతోంది. ఈ రోజు రాత్రికి సీపీఐ నాయకులు.. కేసీ వేణుగోపాల్‌ను కలిసి సీట్ల పంపకంపై చర్చించనున్నారని తెలుస్తోంది. రెండు రోజుల్లో సీట్ల పంపిణీని తేల్చాలని సీపీఐ కోరుతోంది.