ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు
- సెప్టెంబర్ 14తో ముగియనున్న ఉచిత అప్ డేట్ గడువు
- గడువును మరో మూడు నెలలు పొడిగించిన యూఐడీఏఐ
- డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు
ఆధార్ కార్డులో తప్పులు ఉంటే ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ(UIDAI) గడువును పొడిగించింది. ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14వ తేదీతో గడువు ముగియనుంది. అయితే దీనిని మరో మూడు నెలలు పొడిగించింది. అంటే డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు ఉంటుంది.
సాధ్యమైనంత ఎక్కువమంది ఆధార్ కార్డులో తమ డాక్యుమెంట్స్ అప్ డేట్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 14 వరకు ఉన్న గడువును పొడిగించామని యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసుకోవచ్చు.