కేంద్ర ప్రభుత్వం ఒక నీచమైన ప్రభుత్వం.. మానవత్వం లేదు: సిద్ధరామయ్య
- కర్ణాటకు అదనపు బియ్యం అడిగితే ఇవ్వడం లేదని సిద్దూ మండిపాటు
- తాము ఉచితంగా అడగలేదని వ్యాఖ్య
- బియ్యం ఇచ్చేందుకు ఎఫ్సీఐ అంగీకరించిందని వెల్లడి
కేంద్రంలో ఉన్నది నీచమైన ప్రభుత్వం అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాపిటలిస్టులకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పేదలకు అదనంగా బియ్యాన్ని సరఫరా చేయడానికి నిరాకరించిందని చెప్పారు. అన్న భాగ్య పథకం కింద లబ్ధిదారులైన పేదలకు అదనంగా 5 కేజీల చొప్పున సరఫరా చేయాలనే తమ విన్నపాన్ని అంగీకరించలేదని అన్నారు.
గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు 7 కేజీల బియ్యాన్ని ఇచ్చేవాళ్లమని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దాన్ని 4 నుంచి 5 కేజీలకు కుదించిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అదనంగా 5 కేజీల బియ్యాన్ని ఇస్తానని తాను హామీ ఇచ్చానని చెప్పారు. బియ్యాన్ని సేకరించడం కోసం తాము ఫుడ్ కార్పొరేషన్ ఇఫ్ ఇండియాను కూడా సంప్రదించామని... బియ్యాన్ని ఇవ్వడానికి ఎఫ్సీఐ అంగీకరించిందని తెలిపారు. తాము ఉచితంగా బియ్యం అడగడం లేదని, డబ్బు చెల్లిస్తామని అన్నారు.