చంద్రుడిపై ఎకరం స్థలం రూ.10 వేలు... భార్యకు కానుకగా ఇచ్చిన భర్త
- ఇటీవల చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్
- భారత్ బాటలో జపాన్, ఆస్ట్రేలియా
- చంద్రుడిపై స్థలం అమ్మకాలు అంటూ పలు వెబ్ సైట్ల ప్రచారం
- ప్రేమించి పెళ్లాడిన భార్య కోసం చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసిన భర్త
ఇటీవల భారత్ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం అయిన నేపథ్యంలో జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చంద్రుడిపైకి తమ స్పేస్ క్రాఫ్టులను పంపాలని నిర్ణయించాయి. త్వరలోనే చంద్రుడిపై ల్యాండర్లు, రోవర్ల ట్రాఫిక్ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంచితే, ఓ భర్త తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కానుకగా ఇవ్వడం ఆసక్తిగొలుపుతోంది. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ చంద్రుడిపై స్థలం అమ్మకాలు సాగిస్తోంది.
పశ్చిమ బెంగాల్ లోని ఝర్ గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ మహతో, అనుమిక దంపతులు. వాళ్లది ప్రేమ వివాహం. చందమామను అందిస్తానని పెళ్లికి ముందు సంజయ్ మహతో... అనుమికకు హామీ ఇచ్చాడట. తన భార్య పుట్టినరోజు రావడంతో లూనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా అతడు ఎకరం స్థలాన్ని రూ.10 వేలకు కొని, ఆ సర్టిఫికెట్ ను భార్యకు కానుకగా ఇచ్చాడు. భార్య అనుమిక కళ్లలో ఆనందం చూసి సంజయ్ మహతో ముగ్ధుడయ్యాడు.
కాగా, చంద్రుడిపై ప్లాట్ కొనుగోలుకు ఏడాది పట్టిందట. చంద్రుడిపై స్థలం ఎవరికీ చెందినది కాకపోవడంతో, అక్కడ ప్రైవేటు ఓనర్ షిప్ సాధ్యం కాదు. అయితే, కొన్ని సంస్థలు చంద్రుడిపై స్థలాన్ని విక్రయిస్తూ, వినియోగదార్లకు ఆ స్థలం తాలూకు సర్టిఫికెట్లను అందిస్తున్నాయి. ఇది చెల్లుబాటు అవుతుందా, లేదా అని ఆలోచించకుండా కొందరు కొనుగోళ్లకు ముందుకు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశం.