నిన్నటి వరకు రూ.200 పలికిన టమాటా.. ఇప్పుడు ధర లేక రోడ్లపై పారబోత!

  • టమాటాకు ధర లేక రోడ్ల మీద పారబోస్తున్న రైతులు
  • కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన
  • ప్యాపిలి మార్కెట్‌లో కిలో టమాటా ధర కేవలం రూ.3
ఇటీవలి వరకు సెంచరీ, డబుల్ సెంచరీ దాటి కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పించిన టమాటా ధరలు ఇప్పుడు రైతుల కంట నీరు తెప్పిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం టమాటా ధర కిలో రూ.200కు పైన పలికింది. అయితే ఇప్పుడు రూ.1కి కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. టమాటాకు ధరలు లేక రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు.

నంద్యాల జిల్లా ప్యాపిలి టమాటా మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు టమాటాను అక్కడే పారబోసి వెళ్లిపోయారు. వాటిని పశువులు మేశాయి. ధర బాగా తగ్గడంతో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు అన్ని మార్కెట్‌లలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కిలో టమాటా ప్యాపిలిలో రూ.3 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కనీసం రూ.1కి కూడా ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. మదనపల్లి మార్కెట్‌లోను ధరలు పడిపోయాయి.


More Telugu News