కోవలం బీచ్ లో విజయసాయిరెడ్డి... ఫొటోలు ఇవిగో!
- కేరళలోని కోవలం బీచ్ ను సందర్శించిన విజయసాయిరెడ్డి
- ఉదయం పూట వాకింగ్ చేయడం గొప్ప అనుభూతి అందిస్తుందని వెల్లడి
- మత్స్యకారులకు ఎదురయ్యే సవాళ్లు గమనించానంటూ పోస్టు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేరళలోని ప్రఖ్యాత కోవలం బీచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన స్పందనను ఎక్స్ లో పంచుకున్నారు. ఉదయం పూట బీచ్ లో నడక గొప్ప అనుభూతిని అందిస్తుందని తెలిపారు. అది కూడా కోవలం బీచ్ లో అయితే ఆ అనుభూతి రెట్టింపవుతుందని పేర్కొన్నారు.
అయితే, ఈ ఉదయం కోవలం బీచ్ లో వాకింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ చూడని అంశాలు గుర్తించానని, చేపలు పట్టే క్రమంలో సముద్రంలోకి వెళ్లేటప్పుడు మత్స్యకారులు ఎదుర్కొనే సమస్యలు గమనించానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఎగసిపడే అలలకు ఎదురొడ్డి సముద్రంలోకి ప్రవేశించడం మత్స్యకారులకు ఎదురయ్యే సమస్యల్లో కఠినమైనదని వివరించారు. ఇక, సముద్రంలోకి ప్రవేశించాక ఎదురయ్యే సమస్యలు అంతకంటే కఠినమైనవని పేర్కొన్నారు.
"వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో మత్స్యకారుల ఇబ్బందులు చెప్పనలవి కాదు. ఇంతటి కష్టాలు ఎదుర్కొంటూ మనుగడ సాగించే మత్స్యకారులకు శాల్యూట్ చేస్తున్నాను" అంటూ విజయసాయి తన పోస్టులో వివరించారు.