ఇస్రో సన్ మిషన్.. అద్భుతమైన సెల్ఫీ, భూమి, చంద్రుడి ఫొటోలు పంపించిన ఆదిత్య ఎల్-1
- భూకక్ష్యలో తిరుగుతున్న ఆదిత్య ఎల్-1
- క్రమంగా ఆదిత్య కక్ష్యను పెంచుతున్న ఇస్రో శాస్త్రవేత్తలు
- 15 లక్షల కి.మీ. ప్రయాణించి ఎల్1 పాయింట్ కు చేరుకోనున్న ఆదిత్య
సూర్యుడి రహస్యాలను అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదిత్య ఎల్-1 మిషన్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి మిషన్ ప్రయోగాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 భూకక్ష్యలో తిరుగుతోంది. క్రమంగా ఆదిత్య భూకక్ష్యను పెంచుతున్నారు. భూకక్ష్యను దాటిన తర్వాత అది సూర్యుడి దిశగా పయనిస్తుంది. 125 రోజులు 15 లక్షల కి.మీ. ప్రయాణించి ఎల్1 పాయింట్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది. మరోవైపు ఆదిత్య భూకక్ష్యలోనే తన పనిని ప్రారంభించింది. తన సెల్ఫీని తీసుకుంది. అదే విధంగా భూమి, చంద్రుడి ఫొటోలను తీసింది. వీటిని ఇస్రోకు పంపించింది.