ఢిల్లీలో జో బైడెన్, రిషి సునాక్, జస్టిన్ ట్రూడోలకు విడిది ఎక్కడెక్కడంటే..!

  • ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమావేశాలు
  • దేశాధినేతల కోసం భారీ ఏర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • హోటల్ మౌర్యలో బస చేయనున్న బైడెన్
జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఈ సమావేశాలను ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్నాయి. జీ20 సమ్మిట్ కోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీ20 దేశాధినేతలకు, వారి సిబ్బందికి పలు చోట్ల వసతి ఏర్పాట్లను చేశారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ వసతి ఏర్పాట్లు చేశారో చూద్దాం. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్: సమావేశాలకు ఒక రోజు ముందే (8న) బైడెన్ ఇండియాకు వస్తున్నారు. ప్రధాని మోదీతో ఆయన రేపు ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరపనున్నారు. హోటల్ మౌర్యలో బైడెన్ కు వసతి కల్పించారు. 

బ్రిటన్ ప్రధాని రుషి సునాక్: భారతీయ మూలాలు కలిగిన రుషి సునాక్ ప్రధాని హోదాలో తొలిసారి ఇండియాకు వస్తున్నారు. 43 ఏళ్ల రుషి షాంగ్రిలా హోటల్ లో బస చేయనున్నారు. 

కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో: జస్టిన్ ట్రూడో ప్రస్తుతం ఇండొనేషియాలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఏసియన్ సమ్మిట్ లో ఆయన పాల్గొంటున్నారు. అక్నడి నుంచి ఆయన నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. ది లలిత్ హోటల్ లో ఆయన స్టే చేస్తారు. 

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్: ఫిలిప్పీన్స్, ఇండొనేషియా పర్యటనలను ముగించుకుని ఆయన నేరుగా ఢిల్లీకి వస్తున్నారు. ఇంపీరియల్ హోటల్ లో ఆయన బస చేస్తారు. 

చైనా బృందం: సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరు కావడం లేదు. జీ20 సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి ఈ సమ్మిట్ కు చైనా అధ్యక్షుడు గైర్హాజరు కానుండటం ఇదే తొలిసారి. లి కియాంగ్ నేతృత్వంలో చైనా బృందం సమావేశాలకు హాజరుకానుంది. తాజ్ హోటల్ లో వీరికి వసతి ఏర్పాట్లు చేశారు.


More Telugu News