రెండు రోజుల ముందే చంద్రబాబు పాదయాత్ర రికార్డును బ్రేక్ చేసిన నారా లోకేశ్
- 2012లో 208 రోజుల్లో 2,817 కి.మీ పాదయాత్ర చేసిన చంద్రబాబు
- 206 రోజుల్లోనే ఈ మార్కును దాటిన నారా లోకేశ్
- మరో 90 రోజుల్లో 4 వేల కి.మీ లక్ష్యంగా ముందుకెళ్తున్న యువ నేత
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ లో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును లోకేశ్ అధిగమించారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేశారు. తాజాగా లోకేశ్ పాదయాత్ర 206 రోజుల్లోనే 2,817 కి.మీకు చేరుకుంది.
ఎండా, వాన, ఇతర అడ్డంకులను లెక్కచేయకుండా లోకేశ్ దూసుకెళ్తున్నారు. మరో 90 రోజుల్లో 4000 కిలోమీటర్ల లక్ష్యం చేరుకోనున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. జోరువానలోనూ వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చి లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటున్నారు.