వరల్డ్ కప్ కోసం 4 లక్షల సాధారణ ధరల టికెట్లు.. ఎప్పుడు, ఎక్కడ కొనవచ్చంటే..!
- తొలి దశ టికెట్లు క్షణాల్లో అమ్మకం
- రేపటి నుంచి రెండో దశ విక్రయాలు
- ఐసీసీ వెబ్‌సైట్, బుక్‌మై షోలో లభ్యం
భారత్ వేదికగా వచ్చే నెల 5న మొదలయ్యే వన్డే ప్రపంచ కప్‌నకు భారీ డిమాండ్ ఉంది. ప్రపంచ కప్ కోసం ఐసీసీ, బీసీసీఐ తొలి విడతలో అమ్మకానికి పెట్టిన టికెట్లు క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో 4 లక్షల టికెట్లను అందుబాటులోకి తెస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. వీటిని రేపటి నుంచి (శుక్రవారం) రెండో దశలో అమ్మకానికి పెట్టనుంది. తొలి దశలో ఖరీదైన టికెట్లను అమ్మగా.. రెండో దశలో సాధారణ ధరల టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఇందులో భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఎన్ని ఉన్నాయనే దానిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. వీలైనంత ఎక్కువ మందికి టిక్కెట్లు అందేలా చూడటమే తన లక్ష్యమని వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ రాత్రి 8 గంటల నుంచి సాధారణ టికెట్ల విక్రయం జరుగుతుందని తెలిపింది. అభిమానులు అధికారిక వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.com, బుక్ మై షో వెబ్‌సైట్, యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయొచ్చు. మరో దశ టికెట్లను ఎప్పుడు అందుబాటులోకి తెస్తామనేది తదుపరి వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది.