విపక్ష కూటమికి BHARAT పేరు పెట్టాలన్న శశి థరూర్.. దీని అర్థం కూడా చెప్పిన వైనం
- ఇండియా పేరును భారత్ గా మార్చబోతున్న కేంద్రం
- ఇండియా కూటమికి భారత్ అనే పేరు పెట్టుకోవాలన్న శశి థరూర్
- భారత్ పేరు పెట్టుకుంటేనే పేర్లు మార్చే క్రూర క్రీడను కేంద్రం ఆపేస్తుందని వ్యాఖ్య
విపక్షాలు తమ కూటమికి ఇండియా అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని కేంద్రం పేర్కొంటోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు తమ కూటమికి భారత్ (BHARAT) అనే పేరు పెట్టుకోవాలని సూచించారు. BHARAT అంటే Alliance for Betterment, Harmony And Responsible Advancement for Tomorrow (రేపటి అభివృద్ధి, సామరస్యం మరియు బాధ్యతాయుతమైన పురోగతి కూటమి) అని ఆయన వివరించారు. భారత్ పేరు పెట్టుకుంటే కానీ పేర్లు మార్చే క్రూరమైన క్రీడను కేంద్ర ప్రభుత్వం ఆపదని అన్నారు.