లోకేశ్, జగన్ శాశ్వతం కాదు, రాష్ట్రమే శాశ్వతం: నారా లోకేశ్

  • బేతపూడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన 206వ రోజు యువగళం పాదయాత్ర
  • జోరువానలోనూ యువనేతకు లభించిన ఘనస్వాగతం
  • జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టిన నారా లోకేశ్
  • మంగళవారం యువగళంపై జరిగిన దాడిని ఖండించిన యువనేత
  • దాడి జరుగుతుందని ముందుగానే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన
  • తమ హయాంలో జగన్ చేపట్టిన పాదయాత్రలో ఇలాంటి దాడులు జరిగాయా? అని ప్రశ్న
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల ఆశీస్సులతో అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. నేడు 206వరోజు యువగళం పాదయాత్ర బేతపూడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది.  భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేరిపాలెం వద్ద నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నర్సాపురం ఇన్‌ఛార్జి పొత్తూరి రామాంజనేయరాజు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ నేతృత్వంలో యువనేత లోకేశ్‌కు అపూర్వస్వాగతం లభించింది. జోరువానలోనూ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. 

అంతకుముందు భీమవరం అసెంబ్లీ నియోకవర్గం వెంప గ్రామంలో 2,800 కి.మీ.ల మైలురాయి చేరుకున్న సందర్భంగా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వెంపలో క్షత్రియులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్ వారి సమస్యలను తెలుసుకున్నారు.  వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా యువనేత లోకేశ్ జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. యువగళంపై మంగళవారం జరిగిన దాడిపై కూడా స్పందించారు. 

అభివృద్ధి చేయడం కూల్చివేసేంత ఈజీ కాదు జగన్ రెడ్డీ!

‘‘జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 51 నెలలు పూర్తయింది. రాష్ట్రంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి, ఎక్కడా తట్టమట్టిపోసిన పాపాన పోలేదు. రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తే దివాలాకోరు ముఖ్యమంత్రి ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. అభివృద్ధి చేయడమంటే పేదోళ్ల ఇళ్లను పొక్లెయినర్లు తెచ్చి కూల్చివేసినంత ఈజీ కాదు జగన్ రెడ్డీ?!’’ 

పక్కా పథకం ప్రకారమే యువగళంపై దాడి
‘‘ పక్కా పథకం ప్రకారమే యువగళం పాదయాత్రపై మంగళవారం రాత్రి వైసీపీ మూకలు రాళ్లు, సోడాబుడ్లతో దాడికి తెగబడ్డాయని యువనేత నారా లోకేశ్ స్పష్టంచేశారు. భీమవరం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భీమవరం సీఐ ప్రసాద్ బేతపూడి క్యాంప్ సైట్ వద్దకు నోటీసులు తీసుకురాగా, యువనేత లోకేశ్ వాటిని సున్నితంగా తిరస్కరించారు.  
 ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘‘మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, ఎవరినీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయలేదు, మేమెక్కడా గొడవలు సృష్టించడంలేదు. నాకిస్తున్న నోటీసును వైసీపీ వారికి ఎందుకు ఇవ్వడంలేదు? పేదలకు, పెత్తందార్లకు యుద్ధమని మా అధినేత ఫోటోలు వేశారు. జగన్ కు లక్ష కోట్ల ఆస్తి ఉంది. రూ.12కోట్లు ఖర్చు పెట్టి లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాడు. లక్ష రూపాయల చెప్పులు వేసుకుంటున్నాడు. వెయ్యి రూపాయలు విలువ చేసే వాటర్ బాటిల్ ని తాగుతున్నాడు. పెత్తందారు ఎవరు? జగన్ ను నేను ఏం కించపరిచానో ఆయనే చెప్పాలి. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న నాకు నోటీసులు ఎలా ఇస్తారు? వైసీపీ కార్యకర్తలను గొడవకు ప్రేరేపించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు నోటీసులివ్వండి ’’ అని మండిపడ్డారు.

ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు!
‘‘చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పల్నాడు లో పాదయాత్ర చేశాను. ఎక్కడా ఎటువంటి గొడవలు జరగలేదు. నిన్న భీమవరంలో జరిగింది. 4 వ తేదిననే గొడవ జరగబోతోందని మీకు చెప్పాం. టీవీలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను శాంతియుతంగా నడుచుకుంటూ వస్తుంటే వారు కర్రలు తెచ్చి దాడులకు తెగబడ్డారు. ఫోటోలు కూడా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలు అలజడులు సృష్టిస్తుంటే పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. అసాంఘికశక్తులకు ఎందుకు భద్రత కల్పిస్తున్నారో డీజీపీ, సజ్జల విజ్ఞతకే వదిలేస్తున్నాను’’ 

దాడులకు పాల్పడుతున్నది వైసీపీవాళ్లే! 
‘‘శాసనసభ సాక్షిగా నేను జగన్ తల్లిని ఎప్పుడూ అవమానించలేదు. ఏ జిల్లాలో జరగని గొడవలు ఈ జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరముంది. ఈ ప్రభుత్వం పోలీసులను బకరాలను చేస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులతో మాపై దాడులు చేయిస్తోంది. ఇందులో పోలీసులకు కూడా గాయాలయ్యాయ. రాళ్లు వేసింది వైసీపీవారే. మాజీ ఎమ్మెల్యే గారికి రిబ్ విరిగింది. వాలంటీర్లు ఎంతమందికి దెబ్బలు తగిలాయో మీరే చూడాలి. మా మీద మేమే రాళ్లు వేసుకుంటామా? మా చేతుల్లో ఒక్క రాయి లేదు. పోలీసులపై దాడి చేయాలంటే ఎక్కడో చేసి ఉండొచ్చు. ఈ జిల్లాలోనే దాడి ఎందుకు చేస్తాం? పోలీసులు ఆలోచించాల్సిన అవసరముంది’’
 
మిథున్ రెడ్డికి ఇక్కడ ఏం పని? 
‘‘ముఖ్యమంత్రిని  కించపర్చేలా నేను ఏం పదాలు వాడానో చెప్పండి. ఎంపీ మిథున్ రెడ్డికి ఇక్కడ ఏం పని? పుంగనూరు పంచాయతీని ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అతడ్ని కట్టడి చేయండి. పవన్ కల్యాణ్ వారాహిలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయనపై దాడి జరిగింది. ఇప్పుడు నేను వస్తే నాపైనా జరిగింది. మేం గొడవలు చేయడానికి రాలేదని డీఎస్పీకి చెప్పాను. వైసీపీ కార్యకర్త తన బైక్ తెచ్చి మా లైవ్ బైక్ ముందర పెట్టాడు. అలాంటప్పుడు మేం ఏం చేయాలి? మేం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. జగన్ 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఒక్క దాడి జరగలేదు, ఇలా కార్యకర్తలను మేం ఇబ్బంది పెట్టలేదు. చట్టాలను అందరికీ సమానంగా అమలు చేయాలని కోరుతున్నాను’’

లోకేశ్, జగన్ శాశ్వతం కాదు...రాష్ట్రమే శాశ్వతం!
‘‘రాష్ట్రంలో ప్రభుత్వ అరాచక విధానాలపై యువత మాట్లాడాలి, భయపడొద్దు, జగన్, లోకేశ్ శాశ్వతం కాదు, ఆంధ్రరాష్ట్రం శాశ్వతం, ఒక్కసారి వెనకబడితే మళ్లీ గాడిలో పెట్టడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి తేవడం కష్టం. ఒకరిని తీసుకెళ్తే వందమంది వెళ్లాలి, వందమందిని తీసుకెళ్తే వెయ్యిమంది వెళ్లాలి, అప్పుడే ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు’’ 

ఏపీని సైకో జగన్ బీహార్ చేశారు!
‘‘ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరే రాష్ట్రంలో లేవు, ఏపీని సైకో జగన్ మరో బీహార్ గా మార్చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారు. 205రోజులుగా శాంతియుతంగా సాగుతున్న యువగళం పాదయాత్రపై రాళ్లదాడి చేయించింది సైకో ప్రభుత్వం. మా వాలంటీర్లపై తెల్లవారుజామున దాడిచేసి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. సమస్యలపై గళమెత్తడానికి యువగళం ఒకవేదిక, అందరిలో చైతన్యం తీసుకురావాలి. సైకో జగన్ ను తాడేపల్లి కొంపలో పెట్టి తాళం వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’’

వారికి అవకాశమిస్తే బతికే పరిస్థితి ఉండదు!
‘‘విజనరీకి, ప్రిజనరీకి తేడా తెలుసుకోండి. విజనరీ పిల్లలు బాగు పడాలని ఆలోచిస్తాడు. ప్రిజనరీ ఫ్యాక్షనిజం మెంటాలిటీతో ఉంటాడు. చిత్తూరుజిల్లాను చెడగొట్టిన కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం, ఇప్పుడు మిధున్ రెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చాడు. వారిని తిప్పికొట్టకపోతే పుంగనూరులో జరిగిన ఘటనలే అన్ని జిల్లాల్లో జరుగుతాయి. వారికి ఛాన్స్ ఇస్తే ఉభయగోదావరిలో బతికే పరిస్థితి ఉండదు’’
పేదరికానికి కులం, మతం లేవు!
‘‘పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు, పేదరికంనుంచి బయటకు తేవడానికి ఉద్దేశించిన కార్పొరేషన్లను కేవలం జగన్ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చింది, టీడీపీ అధికారంలోకి వచ్చాక దామాషా పద్ధతిన క్షత్రియ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తామని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘‘నిరుపేద కుటుంబాలను ఆదుకునేవిధంగా నిధులు ఇస్తాం. పేదరికం లేని రాష్ట్రమే మా లక్ష్యం. టీడీపీ సైకిల్ కు సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలు, అది పూర్తిచేస్తాం. నాడు, నేడు ఎప్పుడూ క్షత్రియులకు అండగా నిలబడింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల్లో నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తాం’’ అని అన్నారు. 

క్షత్రియులను అణగదొక్కే యత్నం
‘‘తక్కువ జనాభా ఉన్నా అన్నిరంగాల్లో క్షత్రియులు నెం.1గా ఉన్నారు, అన్నిరంగాలను శాసిస్తున్నారు. క్షత్రియులు రాజకీయాల్లో క్రమశిక్షణ, పద్ధతిగా నిలబడుతున్నారు. మిమ్ములను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వారంగంలో చాలా కీలకపాత్ర వహిస్తున్నారు, ఈ ప్రభుత్వం వైఖరి వల్ల క్షత్రియులు చాలా నష్టపోయారు’’

అశోక్ గజపతినీ వేధించారు!
‘‘ఏనాడు అశోక్ గజపతిరాజు కమర్షియల్‌గా ఆలోచించలేదు, నీతి, నిజాయితీగా వ్యవహరించారు. ఎన్నో కీలకమైన పదవులు చేశారు, ఒక్క ఆరోపణ కూడా లేని వ్యక్తిని పనిగట్టుకొని వేధించారు. పుంగనూరులో బాబుగారిపై ఎలా దాడిచేశారో చూశాం, ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించని వ్యక్తిపై రాళ్లదాడి చేయించింది. రఘురామకృష్ణంరాజును ఏం చేశారో మీకు తెలుసు, పార్టీ చేసిన తప్పులను ఎండగడుతున్నారని టార్చర్ చేశారు. మొదట ఆయనను కొట్టారంటే నేను కూడా నమ్మలేదు, హైదరాబాద్ కు సీఐడీ వాళ్లను పంపించారు, ఈ ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అందరూ ఆలోచించాలి. గతంలో టీడీపీలో కూడా చాలామంది విభేదించారు, మేము ఎప్పుడూ ఎవరినీ కొట్టలేదు’’

పాదయాత్ర సందర్భంగా నర్సాపురం నియోజకవర్గం నక్కావారిపాలెం దళితులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగల్తూరు గాంధీవిగ్రహం వద్ద స్థానిక ప్రజలు యువనేత లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మొగల్తూరు స్మార్ట్ పాయింట్ వద్ద కాపు సామాజికవర్గీయులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అందరి సమస్యలు సావధానంగా విన్న లోకేశ్ టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వివరాలు
  • ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2,818.4 కి.మీ.
  • ఈరోజు నడిచిన దూరం 17.7 కి.మీ.

207వరోజు (7-9-2023) యువగళం వివరాలు
నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)
ఉదయం
8.00 – సీతారాంపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.15 – నర్సాపురం జగన్నాథ ఆలయం వద్ద చేనేతలతో సమావేశం.
10.00 – పంజా సెంటర్ లో ముస్లింలతో సమావేశం.
10.30 – థాయ్ సుబ్బారావు హాస్పటల్ వద్ద స్థానికులతో భేటీ.
10.40 – గాంధీ విగ్రహం వద్ద మహిళలతో సమావేశం.
10.50 – జ్యుయలరీ సెంటర్ లో రజక సామాజికవర్గీయులతో భేటీ.
11.00 – బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
11.10 – శ్రీహరిపేటలో బీసీ సామాజికవర్గీయులతో సమావేశం.
11.20 – రైల్వే రోడ్డులో స్థానికులతో సమావేశం.
11.40 – నర్సాపురం లాక్ పేటలో స్థానికులతో సమావేశం.
12.25 – సరిపల్లిలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం.
12.40 – సరిపల్లి శివార్లలో భోజన విరామం.

సాయంత్రం
3.00 – సరిపల్లి శివార్లలో అగ్నికుల క్షత్రియులతో ముఖాముఖి.
4.00 – సరిపల్లి శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – చినమామిడిపల్లి వద్ద పాదయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశం.
6.00 – దిగమర్రు వద్ద మహిళలతో సమావేశం.
6.20 – పెదమామిడిపల్లి వద్ద కల్లుగీత కార్మికులతో సమావేశం.
7.20 – తూర్పు కాజ వద్ద ఎంఆర్ పీఎస్ కార్యకర్తలతో భేటీ.
8.00 – కలగంపూడిలో శాలివాహన సామాజికవర్గీయులతో సమావేశం.
8.20 – కలగంపూడి శివారు విడిది కేంద్రంలో బస.


More Telugu News