గురువుల కంటే గూగుల్ మేలు వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ

గురువుల కంటే గూగుల్ మేలు వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ
  • అనని మాటలను అన్నట్లుగా చెబుతున్నారని మంత్రి ఆవేదన
  • తనపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నాన్న ఆదిమూలపు సురేశ్
  • గూగుల్‌పై ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారనే ఉద్ధేశ్యంతో చెప్పినట్లు వెల్లడి
గురువుల కంటే గూగుల్ మేలు అని తాను వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగుతోందని, తాను అనని మాటలను అన్నట్లుగా చెబుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... గురువుల కంటే గూగుల్ మేలు అని తాను అనలేదని, ఈ తరహా వార్తలను తాను ఖండిస్తున్నానన్నారు. మారుతున్న కాలంతో కొందరు టెక్నాలజీని అందిపుచ్చుకొని గూగుల్‌పై ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారనే ఉద్ధేశ్యంతో తాను మాట్లాడినట్లు చెప్పారు. తల్లిదండ్రులు, గురువులపై గౌరవం కలిగిన వ్యక్తినని, తాను అలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.


More Telugu News