ఆ పాత్రకు దక్షిణాదిన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే న్యాయం చేయగలరు: బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ
- జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ సరిపోతుందన్న అభిప్రాయం
- సన్నీడియోల్ కాకుండా మరో నటుడు బాంబేలో కనిపించలేదని వెల్లడి
- సమయం వచ్చినప్పుడు గదర్-3 తీస్తానని బదులు
దక్షిణాది నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభకు నిదర్శనంగా.. గదర్ సినిమా దర్శకుడు అనిల్ శర్మ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. బాలీవుడ్ హంగామాతో మాట్లాడిన సందర్భంలో.. గదర్ లేదంటే గదర్-2లో తారా సింగ్ పాత్రను సన్నీడియోల్ కాకుండా ఎవరు పోషించగలరు? అనే ప్రశ్నను ఎదుర్కొన్నారు. ఇప్పుడు గనుక గదర్ సినిమాను తీస్తే అందులో సకీన, తారాసింగ్ పాత్రలను పోషించగల యువ నటులు ఎవరైనా ఉన్నారా? అన్న ప్రశ్న దర్శకుడికి ఎదురైంది.
‘‘యువ నటుల్లో నాకు ఎవరూ కనిపించలేదు. బాంబేలో అలాంటి వారిని ఎవరినీ చూడలేదు. దక్షిణాదిన అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్రను చేయగలరు. ఆయనకు ఉన్న ఇమేజ్ ఇందుకు సరిపోతుంది’’ అని అనిల్ శర్మ పేర్కొన్నారు. సకీనా పాత్రకు వేరొకరి పేరును ఆయన చెప్పలేకపోయారు. అనిల్ శర్మ తెరకెక్కించిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమా 2001 జూన్ 15న విడుదల కాగా, గదర్-2 2023 ఆగస్ట్ 11న విడుదల కావడం గమనార్హం. గదర్-3లో సన్నీడియోల్ తాత పాత్రను పోషిస్తారా? అని ప్రశ్నించగా.. గదర్-3 గురించి మాట్లాడనంటూనే, సమయం వచ్చినప్పుడు తీస్తానని బదులిచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి పరిచయడం కావడం తెలిసిందే.