గూగుల్ వచ్చాక గురువులు లేకున్నా ఏంకాదన్న ఏపీ మంత్రి

  • ఉపాధ్యాయ దినోత్సవం నాడే గురువులను అగౌరవపర్చిన వైనం
  • ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీచర్లు
కాలం ఎంత మారినా, ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సరే దాని గురించి చెప్పడానికి ఓ గురువు కావాల్సిందే.. అంటే సమాజంలో గురువుకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచం ఎంతగా మార్పుచెందినా గురువు స్థానంలో మార్పుండదు. అయితే, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాత్రం గురువులను తక్కువ చేస్తూ వ్యాఖ్యానించారు. అదికూడా సాక్షాత్తూ గురుపూజోత్సవం రోజే కావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఏంజరిగిందంటే..

గురుపూజోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ వ్యాఖ్యానించారు. గూగుల్ వచ్చాక గురువుల అవసరం పెద్దగా లేకుండా పోయిందని అన్నారు. గురువులకు తెలియని విషయాలు కూడా గూగుల్ లో కొడితే వస్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబుల్లో సమస్త సమాచారాన్ని బైజూస్ టెక్నాలజీ పొందుపరిచిందని వివరించారు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని అన్నారు.  


More Telugu News