ఎం.కోడూరులో 13 అడుగుల పొడవున్న గిరినాగు పట్టివేత
- కోళ్లను వెంబడిస్తూ వాటి గూట్లోకి దూరిన పాము
- 20 నిమిషాలు శ్రమించి పట్టుకున్న పాములు పట్టే నిపుణుడు
- వంట్లమామిడి సమీపంలోని అటవీప్రాంతంలో విడిచిపెట్టిన వైనం
అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు నిన్న కోళ్లను వెంబడిస్తూ వాటి గూట్లోకి దూరింది.
గమనించిన రైతు వెంటనే పాములు పట్టడంలో నిపుణుడైన వెంకటేశ్‌కు సమాచారం అందించాడు. ఆయన వచ్చి దాదాపు 20 నిమిషాలు శ్రమించి పామును పట్టుకున్నాడు. అనంతరం దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.