హైదరాబాద్ లో వర్ష బీభత్సం... నాలాలో పడి కొట్టుకుపోయిన బాలుడు
- హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వాన
- జనజీవనం అస్తవ్యస్తం
- బాచుపల్లి పరిధిలోని ఎన్నారై కాలనీ వద్ద నాలాలో పడిన బాలుడు
- నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద మృతదేహం
- బయటికి తీస్తుండగా మళ్లీ కొట్టుకుపోయిన మృతదేహం
హైదరాబాద్ నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయిన ఘటన విషాదాంతం అయింది. నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద ఆ బాలుడి మృతదేహం తేలింది. కానీ అక్కడ్నించి మరోసారి కొట్టుకుపోయింది.
బాచుపల్లి పరిధిలోని ఎన్నారై కాలనీ వద్ద ఆ బాలుడు నాలాలో పడిపోయాడు. బాలుడి కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించిన అధికారులు, మృతదేహాన్ని బయటికి తీస్తుండగా, నీటి ఉద్ధృతికి మళ్లీ కొట్టుకుపోయింది. బాలుడి మృతదేహం నాలా ప్రవాహంతో పాటు తుర్క చెరువులోకి కొట్టుకుపోయింది. దాంతో అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వారితో తుర్క చెరువులో గాలింపు చేపట్టారు.