సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యమవుతున్నాయి: మంత్రి బొత్స

  • ఇవాళ గురు పూజ్యోత్సవం
  • విశాఖ ఆంధ్రా వర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా మంత్రి బొత్స
  • ఈ నెల 8వ తేదీ లోపు టీచర్ల ఖాతాల్లో జీతాలు జమ చేస్తామని స్పష్టీకరణ
ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ కాన్వొకేషన్ హాలులో గురు పూజ్యోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి బొత్స పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు కూడా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి బొత్స మాట్లాడుతూ, టీచర్లకు జీతాలు లేవని కొందరు విమర్శిస్తున్నారని, అయితే సాంకేతిక కారణాలతో జీతాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఈ నెల 7, లేదా 8 తేదీల్లో ఉపాధ్యాయుల ఖాతాల్లో జీతాలు జమ చేస్తామని పేర్కొన్నారు. 

నియామకాల గురించి చెబుతూ, నెల రోజుల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు.


More Telugu News