కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ కోర్టు సమన్లు
- కేజ్రీవాల్ భార్య సునీతకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ కేసు
- ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్ లో రెండు చోట్ల ఓటు
- సునీతపై ఫిర్యాదు చేసిన ఢిల్లీ బీజేపీ నేత హరీశ్ ఖురానా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది. రెండు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేసుకున్నారనే కేసును విచారించిన కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని చాందిని చౌక్ అసెంబ్లీ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్ లోని షాహిబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమెకు ఓట్లు ఉన్నాయంటూ ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద కేసు నమోదయింది.
ఈ నేపథ్యంలో తమ ముందు నవంబర్ 18న హాజరు కావాలని ఆదేశిస్తూ హైకోర్టు సమన్లు జారీ చేసింది. సునీత కేజ్రీవాల్ పై బీజేపీ ఢిల్లీ కార్యదర్శి హరీశ్ ఖురానా ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. అంతేకాదు ఆమెకు రెండు చోట్ల ఓట్లు ఉన్న డాక్కుమెంట్లను ఆయన కోర్టుకు అందించారు.