వీలైతే వర్క్ ఫ్రమ్ హోం చేసుకోండి: ఐటీ ఉద్యోగులకు పోలీసుల సూచన

  • హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం
  • చెరువులను తలపిస్తున్న రోడ్లు, కాలనీలు
  • మరో రెండు గంటల పాటు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా ఐటీ జోన్ లో ట్రాఫిక్ మరింత ఇబ్బందికరంగా ఉంది. హైదరాబాద్ లో మళ్లీ మరో రెండు గంటల పాటు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతారణశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కీలక సూచన చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. వీలైనంత వరకు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు.


More Telugu News