నేపాల్‌తో మ్యాచ్‌లో పలు రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ
- నేపాల్‌పై 59 బంతుల్లో 74 పరుగులు సాధించిన రోహిత్
- ఆసియాకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీ రికార్డు
- దిగ్గజ ఆటగాడు సచిన్ రికార్డు బద్దలు
- ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన తొలి ఇండియన్‌గా మరో ఘనత
ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేసిన టీమిండియా సారథి రోహిత్‌శర్మ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ఆసియాకప్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 9 అర్ధ సెంచరీలతో ఇప్పటి వరకు టాప్ ప్లేస్‌లో ఉండగా రోహిత్ 10 హాఫ్ సెంచరీలతో అతడిని అధిగమించాడు. అలాగే, ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో 23 సిక్సర్లతో మరో రికార్డును తనపేరున రాసుకున్నాడు. 18 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సురేశ్ రైనా రికార్డును బద్దలుగొట్టాడు. ఓవరాల్‌గా 26 సిక్సర్లతో షాహిద్ అఫ్రిది, 23 సిక్సర్లతో సనత్ జయసూర్య ముందున్నారు.