హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

  • తెల్లవారుజామునే మొదలైన వర్షం
  • మూడు గంటలపాటు జోరువాన
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజామునే మొదలైన వర్షం దాదాపు మూడు గంటలపాటు ఆగకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతులో నీరు చేరడంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. కూకట్‌పల్లి నుంచి హయత్‌నగర్ వరకు నగరమంతా ఎడతెరిపిలేని వాన కురిసింది. 

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా రోడ్లు జలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


More Telugu News