అభివృద్ధి ప్రదాత ఎవరో అర్థమైందా రాజా?: నారా లోకేశ్
- పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం
- ఉండి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- ఉండిలో ఆక్వా రైతులతో లోకేశ్ ముఖాముఖి
- సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. భారీ గజమాలలు, హారతులతో అభిమానులు, మహిళలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. సెల్ఫీల కోసం యువతీయువకులు పోటీపడ్డారు.
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన లోకేశ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంచుతూ రాబోయే రోజుల్లో తాము ఏం చేయబోతున్నామో వివరించారు.
ఇక, భీమవరం శివార్లలో నర్సాపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి, సీనియర్ నాయకుడు పెన్మెత్స వెంకటేశ్వరరాజు నేతృత్వంలో లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది.
లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్
ఇది భీమవరంలోని కియా కార్ల షోరూమ్. దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమను రప్పించి, ఉద్యోగాల పంట పండించారు దార్శనిక నేత చంద్రబాబు నాయుడు. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించాయి.
51 నెలల జలగన్న పాలనలో చేసిందేమిటి? ఫ్యాక్స్ కాన్, అమర్ రాజా, జాకీ, లులూ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశాడు. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాక చేపల దుకాణాలు, మటన్ మార్టులు పెట్టించాడు. అభివృద్ధి ప్రదాత ఎవరో, విధ్వంసక పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరో అర్థమైందా రాజా...?
వైట్ స్పాట్ వైరస్ కంటే ఇది డేంజర్!
టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే నిరంతర విద్యుత్ అందిస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాలులో ఆక్వారైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. "రొయ్యలను నాశనం చేస్తున్న వైట్ స్పాట్ వైరస్ కంటే జగనోరా వైరస్ అత్యంత ప్రమాదకరం.
జగనోరా వైరస్ వలన ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. ఆక్వాపై ఆధారపడిన 10 లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. టీడీపీ హయాంలో ఆక్వా రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టాం. విద్యుత్, ఏరియేటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర పనిముట్లు సబ్సిడీలో ఇచ్చాం. జగన్ ఇప్పుడు అన్ని రేట్లు పెంచి ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశాడు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీడ్ కంపెనీలతో మాట్లాడి పెట్టుబడి తగ్గించే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ల్యాబ్స్ ని బలోపేతం చేసి, అవసరాన్ని బట్టి మరిన్ని ప్రభుత్వ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం. ఆక్వా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి నాణ్యమైన సీడ్ తీసుకొస్తాం.
నెక్ తరహాలో ఆక్వా ఉత్పత్తులు దేశీయంగా అమ్మకాలు పెంచడానికి ఒక బోర్డు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతాం" అని వెల్లడించారు.
అది కూడా జగన్ బంధువులదే!
చంద్రబాబు గారు విజనరీ... జగన్ ఒక ప్రిజనరీ. చంద్రబాబు విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంటే వాటిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అందుకే రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్ల సప్లై కూడా జగన్ బంధువులదే... అందుకే రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతుల పెట్టుబడులు తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రపంచంలో ఉన్న బెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి మీ ఆదాయం పెంచే బాధ్యత మాది.
వైసీపీ నేతలు ఇక్కడ కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు!
ఉభయ గోదావరి జిల్లాలు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి చోట కూడా వైసీపీ నాయకులు చిల్లర రాజకీయం మొదలు పెట్టారు. ఆక్వా సంబంధిత పరిశ్రమలను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. నీటి ఛార్జీలు, పవర్ హాలిడే, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ యూనిట్లకి కావాల్సిన అన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం. కల్తీ ఫీడ్, సీడ్ ఇచ్చే కంపెనీలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2,788.2కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 13 కి.మీ.*
*205వరోజు (5-9-2023) యువగళం వివరాలు*
*భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*
సాయంత్రం
4.00 – భీమవరం శ్రీరామ ఆటోమొబైల్స్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
5.00 – భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో బహిరంగసభ, నారా లోకేశ్ ప్రసంగం.
6.20 – పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం.
6.35 – ఎన్టీఆర్ విగ్రహం వద్ద భవననిర్మాణ కార్మికులతో సమావేశం.
రాత్రి
7.05 – సోమేశ్వరస్వామి దేవాలయం వద్ద బ్రాహ్మణులతో సమావేశం.
7.35 – తాడేరు బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.
7.50 – ఇందిరమ్మకాలనీలో స్థానికులతో సమావేశం.
8.20 – తాడేరు మెయిన్ రోడ్డులో టిడ్కో లబ్ధిదారులతో సమావేశం.
8.50 – తాడేరు సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
9.35 – తాడేరు అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
10.30 – బేతపూడివద్ద విడిది కేంధ్రంలో బస.
******