పవన్ కల్యాణ్, లోకేశ్‌ల గురించి బాగా ఆలోచించండి!: మంత్రి రోజా
- ఐటీ నోటీసులపై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదన్న రోజా
- లోకేశ్, పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదన్న మంత్రి
- ఇలాంటి వారికి అధికారం ఇస్తే బాగు చేస్తారా? ముంచేస్తారా? ఆలోచించాలని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఐటీ శాఖ నోటీసుల అంశంపై ప్రశ్నించారు. అలాగే ఐటీ నోటీసులపై మౌనం వహిస్తున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అసహనం వ్యక్తం చేశారు.
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరన్నట్టు అందరికీ సుద్దులు చెప్పే చంద్రబాబు ఏకంగా ప్రజల కోసం నిర్మించే రాజధాని అమరావతి విషయంలోనే అవినీతికి తెర తీశాడని, దీనికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు ఇస్తే ఇప్పటివరకూ సమాధానం చెప్పలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. కనీసం ఆయన తనయుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ నుంచి కూడా ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదన్నారు. ఇలాంటి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బాగుచేస్తారా? ముంచేస్తారా? బాగా ఆలోచించాలని పేర్కొన్నారు.