మళ్లీ మొదలైన మ్యాచ్... నేపాల్ ను 230 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్

  • ఆసియా కప్ లో నేడు భారత్ × నేపాల్
  • టాస్ గెలిచి నేపాల్ కు బ్యాటింగ్ అప్పగించిన భారత్
  • 48.2 ఓవర్లలో ఆలౌట్ అయిన నేపాల్
  • చెరో 3 వికెట్లు తీసిన సిరాజ్, జడేజా
  • టీమిండియా టార్గెట్ 231 రన్స్
ఆసియా కప్ లో నేడు భారత్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. నేపాల్ బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో ఓసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన అనంతరం మ్యాచ్ మళ్లీ మొదలవగా... నేపాల్ ను టీమిండియా 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేసింది. 

నేపాల్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఆసిఫ్ షేక్ 58, కుశాల్ భుర్టెల్ ఆకట్టుకున్నారు. లోయరార్డర్ లో సోంపాల్ కామీ 48 రాణించాడు. గుల్షన్ ఝా 23, దిపేంద్ర సింగ్ ఐరీ 29 పరుగులు  చేశారు. 

టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, రవీంద్ర జడేజా 3, షమీ 1, హార్దిక్ పాండ్యా 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె మైదానంలో జరుగుతోంది.


More Telugu News